Google Maps లో మీ shop కనిపించాలా?
ఎవరైనా “near me” అని Google లో వెతికినప్పుడు, మీ business కనిపిస్తుందా? Google Business Profile తో — పూర్తిగా ఉచితంగా — మీ shop Google Search, Maps లో కనిపిస్తుంది. ఎలా చేయాలో step by step చెప్తాను.
Google Business Profile అంటే?
Google లో మీ business పేరు వెతికినప్పుడు కుడి వైపు (phone లో పైన) వచ్చే box — పేరు, photos, timings, phone number, directions, reviews. దాన్ని Google Business Profile అంటారు. ఇది ఉచితం.
📍 Maps లో కనిపిస్తారు
“Tailor near me”, “Tiffin centre Kukatpally” లాంటి searches లో మీ shop రావచ్చు.
📞 ఒక్క tap లో call
Customer మీ profile నుండే call చేయవచ్చు, directions తీసుకోవచ్చు.
⭐ Reviews తో నమ్మకం
మంచి reviews ఉన్న shop ని కొత్త customers ఎక్కువగా నమ్ముతారు.
మొదలుపెట్టే ముందు ఇవి రెడీ పెట్టుకోండి
- ఒక Google account (Gmail)
- Business పేరు — board మీద ఉన్నట్టే, ఖచ్చితంగా
- Shop address (లేదా మీరు సర్వీస్ ఇచ్చే areas)
- Business phone number
- Website ఉంటే దాని link
- Shop బయట, లోపల, products/పని photos
Setup — Step by step
Google Business Profile తెరవండి
Google లో “Google Business Profile” అని వెతికి, “Manage now” నొక్కి, మీ Gmail తో login అవ్వండి.
పేరు, category
Business పేరు టైప్ చేయండి. Category సరిగ్గా ఎంచుకోండి (ఉదా: “Tailor”, “Restaurant”, “Beauty salon”).
Location లేదా service area
Customers మీ shop కి వస్తే address ఇవ్వండి. మీరే customers దగ్గరికి వెళ్తే (plumber, tutor), service areas ఎంచుకోండి.
Phone, website
Customers call చేసే number, website link (ఉంటే) ఇవ్వండి.
Verify చేయండి
Google మీ business నిజమో కాదో check చేస్తుంది. Options కింద చూడండి.
Profile పూర్తి చేయండి
Timings, photos, services, short description add చేయండి. పూర్తి profile ఎక్కువగా కనిపిస్తుంది.
Verification ఎలా ఉంటుంది?
మీకు ఏ option వస్తుందో Google నిర్ణయిస్తుంది. సాధారణంగా వచ్చేవి:
🎥 Video (ఎక్కువగా వచ్చేది)
మీ phone తో ఒక చిన్న video తీయాలి — shop board, చుట్టుపక్కల road/landmark, shop లోపల, మీరే owner అని చూపించే proof (shop తాళం తీయడం, billing counter, tools లాంటివి).
📱 Phone / SMS
మీ business number కి code వస్తుంది. దాన్ని enter చేస్తే చాలు.
✉️ Email / Postcard
కొందరికి email వస్తుంది. Postcard ఇప్పుడు చాలా అరుదు.
Verification కి సాధారణంగా 5 పని రోజుల వరకు పట్టవచ్చు, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ. ఓపిక పట్టండి — మళ్లీ మళ్లీ కొత్త profile తయారు చేయకండి.
Maps లో పైన కనిపించడానికి 5 tips
నిజమైన photos
Shop, products, పని photos ఎక్కువగా పెట్టండి. Stock photos వద్దు.
Reviews అడగండి
సంతోషంగా ఉన్న customers కి review link పంపి అడగండి. ప్రతి review కి reply ఇవ్వండి.
సరైన timings
Festival holidays కూడా update చేయండి. Customer వచ్చి shop మూసి ఉంటే చెడ్డ review వస్తుంది.
ఒకే వివరాలు అన్ని చోట్లా
పేరు, address, phone — website, Facebook, Google లో ఒకేలా ఉండాలి.
Website link
Profile లో website ఉంటే customers మీ services, ధరలు చూసి నమ్మకంగా contact చేస్తారు.
❌ ఈ తప్పులు చేయకండి
- పేరులో keywords: “Ravi Tailors Best Tailor Hyderabad Cheap” లాంటి పేరు పెడితే profile suspend కావచ్చు. Board మీద ఉన్న పేరే పెట్టండి.
- Fake reviews కొనడం: Google పట్టుకుంటుంది, reviews తీసేస్తుంది లేదా profile suspend చేస్తుంది.
- ఒకే business కి 2 profiles: Verify ఆలస్యమైనా కొత్తది తయారు చేయకండి.
- వేరే వాళ్ల Gmail తో setup: Profile ఎప్పుడూ మీ సొంత Gmail మీదే ఉండాలి.
Profile setup లో help కావాలా?
Setup, photos, description, website link — ఏదైనా సందేహం ఉంటే WhatsApp లో అడగండి. మీ business కి website కూడా కావాలంటే అది కూడా చేసి పెడతాను.
WhatsApp లో మాట్లాడండినా సర్వీసులు చూడండి
ఈ guide ఉపయోగపడితే, మీ business friends కి WhatsApp లో share చేయండి 🙏 • అన్ని ఉచిత Guides →