Customers నుండి online లో డబ్బు ఎలా తీసుకోవాలి? UPI QR & Razorpay Payment Link

ఉచిత Guide 2 • 6 నిమిషాల చదువు

Customers నుండి online లో డబ్బు ఎలా తీసుకోవాలి?

“Advance ఎలా పంపాలి సార్?” — customer అడిగినప్పుడు మీ దగ్గర సరైన జవాబు ఉందా? ఈ guide లో 3 సులభమైన మార్గాలు, ఖర్చు, ఏది మీకు సరిపోతుందో సింపుల్‌గా చెప్తాను.

3 మార్గాలు — ఒక్క చూపులో

చాలా సులభం

1. UPI QR Code

PhonePe Business, Paytm for Business, Google Pay లేదా మీ bank ఇచ్చే QR. Customer scan చేసి pay చేస్తారు.

  • సాధారణంగా ఖర్చు లేదు
  • Shop లో, WhatsApp లో పంపడానికి బాగుంటుంది
  • Card payments, automatic receipts ఉండవు
Professional

2. Razorpay Payment Link

ఒక link తయారు చేసి WhatsApp/SMS లో పంపండి. Customer UPI, card, netbanking — ఏదైనా వాడి pay చేయవచ్చు.

  • అన్ని payment methods
  • Automatic receipt, dashboard లో record
  • ప్రతి payment పై fee ఉంటుంది
Digital products

3. Gumroad

Ebooks, PDFs, courses అమ్మడానికి. Payment అయిన వెంటనే customer కి file automatic గా వెళ్తుంది. విదేశీ customers కి కూడా.

  • Setup చాలా సులభం
  • Dollars లో అమ్మవచ్చు
  • ప్రతి sale పై commission ఉంటుంది

మీకు ఏది సరిపోతుంది?

  • Shop / చిన్న business, తెలిసిన customers: UPI QR చాలు.
  • Advance payments, services, online orders: Razorpay Payment Link — professional గా కనిపిస్తుంది, ప్రతి payment record అవుతుంది.
  • Website లో “Pay Now” button కావాలి: Razorpay Payment Button.
  • Ebooks, PDFs, courses: Gumroad (లేదా India కోసం Razorpay + automatic download).

Razorpay ఖర్చు ఎంత?

Razorpay standard plan లో setup fee లేదు, సంవత్సర fee లేదు. ప్రతి successful payment పై 2% + GST (మొత్తం దాదాపు 2.36%) తీసుకుంటారు.

ఉదాహరణ

Customer ₹1,000 pay చేస్తే:

≈ ₹976

మీ bank account కి వస్తుంది (≈ ₹24 fee + GST)

కొత్త merchants కి offers

Razorpay కొన్నిసార్లు కొత్తగా చేరిన వారికి తక్కువ fee offers ఇస్తుంది. Sign up చేసేటప్పుడు ప్రస్తుత offer చూడండి.

ధరలు మారవచ్చు. Razorpay website లో ప్రస్తుత pricing చూసుకోండి.

Razorpay Payment Link — Step by step

1

Account తెరవండి

razorpay.com లో మీ mobile number, email తో sign up చేయండి.

2

KYC పూర్తి చేయండి

PAN, bank account వివరాలు, business వివరాలు అడుగుతారు. Approve అయ్యాకే డబ్బు మీ account కి వస్తుంది.

3

Payment Link తయారు చేయండి

Dashboard లో Payment Links → Create. Amount, ఏం కోసం (ఉదా: “Website advance”), customer phone/email ఇవ్వండి.

4

WhatsApp లో పంపండి

Link copy చేసి customer కి పంపండి. Pay చేసిన వెంటనే మీకు, customer కి message వస్తుంది.

⚠️ జాగ్రత్తలు — తప్పకుండా చదవండి

Screenshot నమ్మకండి

“Pay చేశాను” అని screenshot పంపితే చాలదు. మీ bank app లేదా Razorpay dashboard లో డబ్బు వచ్చిందో check చేసుకుని, తర్వాతే పని/product ఇవ్వండి.

డబ్బు తీసుకోవడానికి PIN అవసరం లేదు

ఎవరైనా “డబ్బు పంపుతాను, ఈ request accept చేసి PIN వేయండి” అంటే — అది మోసం. PIN వేస్తే డబ్బు పోతుంది, రాదు.

OTP ఎవరికీ చెప్పకండి

Bank, Razorpay పేరుతో call చేసినా OTP, password ఎవరికీ చెప్పకండి.

ఇది మీ కోసం నేనే setup చేసి పెట్టాలా?

Razorpay payment button / Gumroad product setup — ₹999 మాత్రమే, 1 రోజులో. Test చేసి, ఎలా వాడాలో తెలుగులో చూపిస్తాను.

WhatsApp లో మాట్లాడండి
అన్ని ధరలు చూడండి

ఈ guide ఉపయోగపడితే, మీ business friends కి WhatsApp లో share చేయండి 🙏 • అన్ని ఉచిత Guides →